Learning through Field Trips ( Telugu )

పారిశ్రామిక వైజ్ఞానిక క్షేత్ర పర్యటన" విశ్లేషణాత్మక వ్యాసం.
వ్యాసకర్త: రమేష్ వానపల్లి.
భౌతిక శాస్త్ర  ఉపాధ్యాయులు,  అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇంచార్జ్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరం విజయనగరం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 22 , 2021 ముందుగానే నిర్ణయించుకున్నట్లు అటల్ టింకరింగ్ ల్యాబ్ నుంచి మంచి ప్రాజెక్టులు చేసిన పదిమంది విద్యార్థులు, నేను, హైదరాబాద్ నుండి వచ్చిన జి జయ ప్రకాష్ బాబు గారు ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాల వద్దకు చేరుకున్నాం. ప్రకాష్ గారు సోలార్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు‌. ముందురోజే ల్యాబ్ లో సోలార్ వర్క్ షాప్ నిర్వహించారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి , సోలార్ పేనల్స ను బల్బులు మోటార్ లతో అనుసంధానం చేసి వాటితో చిన్న చిన్న ప్రాజెక్టులను విద్యార్థులచే చేయించారు. ఈయన కూడా మా ఒకరోజు పారిశ్రామిక, వైజ్ఞానిక , క్షేత్ర పర్యటనకు మార్గదర్శకత్వం వహించడం మాకు చాలా సంతోషం అనిపించింది‌. ఆయనకు కొత్త ప్రాంతం కాబట్టి చాలా ఉత్సుకతతో బయలుదేరారు. 
concepts covered:
Students could learnt about types of energy sources, solar energy it's application, how to make solar panels, connecting the solar panels with bulbs and fans  , series and parallel circuit connection s etc. 
 పాఠశాల వద్ద స్కార్పియో వాహనం లో  ఇద్దరు మెంటార్స్ పదిమంది విద్యార్థులు 8:30 నిమిషములకు బయలుదేరాం. విద్యార్థులందరూ ఏటిఎల్ , డి విఎమ్ లోగోతో ఉన్న  టీ షర్ట్ లు ధరించారు .చేతిలో ఫీల్డ్ ట్రిప్  లాగ్ బుక్ పట్టుకున్నారు. వాహనం కొద్దిదూరం వెళ్ళగానే ముందురోజే విద్యార్థులకు తెలియజేసి తీసుకొని రమ్మని చెప్పిన తల్లిదండ్రుల అనుమతి పత్రాలను ఇవ్వమని అడిగాను. నలుగురు మాత్రమే ఖచ్చితమైన ఫార్మెట్లో నేను చెప్పినట్లు తెచ్చారు , ఇద్దరు అసలు తేలేదు, మిగిలిన వారు వేరే ఫార్మెట్లో తెచ్చారు. నాకు కోపం, బాధ అ రెండు వచ్చాయి. క్షేత్ర పర్యటన అనేది ఒక నిర్మాణాత్మక అభ్యసన కు సంబంధించిన కృత్యం దీనిలో విద్యార్థులు  పాఠ్యాంశ విషయాలు, అదనపు విషయాలు ఎన్నో నేర్చుకోగలరు , మంచి అనుభూతులను పొందుతారు, అందుకోసం ఈ క్షేత్ర పర్యటన తల పెట్టాము. డబ్బులు కూడా ఏటీఎల్ నిధులు నుండి ఖర్చు చేస్తున్నాం పిల్లలు చేతి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు. మీరు ఇవ్వవలసినది ఒక్క తల్లిదండ్రులు అనుమతి పత్రం మాత్రమే. అది కూడా మీరు తేకుండా ఎందుకు వచ్చారు? అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే పూర్తిగా ఉపాధ్యాయులను  బాధ్యులు  చేయడానికేనా! అందుకే ఉపాధ్యాయులు ఇలాంటి  కృత్యాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అధికారులు ప్రోత్సాహం గానీ, తల్లిదండ్రుల భరోసా గాని లేకపోతే ఉపాధ్యాయులకు ఏమి కర్మ ఇవన్నీ  నిర్వహించడానికి ? అందుకే విద్యా బోధన  నాలుగు గోడల మధ్య పరిమితం అయిపోయింది. ఎవరో ఏవో చెబితే వింటారు , కానీ ఉపాధ్యాయులు చెప్పిన మాటల మీద మీకు గౌరవం ఎందుకు ఉండకూడదు? అని విద్యార్థులను మందలించాను. ఇంతలో ఎస్ కోట చేరుకున్నాం. నేను చెప్పిన ఈ విధంగా అనుమతి పత్రాలు తెచ్చిన వారు ఉండండి . మిగిలిన వారు ఈ డబ్బులు తీసుకొని బస్సులో స్కూల్ కి వెళ్ళిపొండి అని డబ్బులు తీసి ఇచ్చాను. లేదు సార్ ఇప్పుడే మా పేరెంట్స్ సంతకాలతో పత్రాలను వాట్సాప్ లో పంపించమంటాం  అంటూ బ్రతిమిలాడారు. వెంటనే నా ఫోను తీసుకొని ఒక్కొక్కరుగా ఫోన్ చేసి  అనుమతి పత్రాలను తెప్పించారు. నెమ్మదిగా 9:30 నిమిషములకు  బౌడారా   కేలిక్స్ కంపెనీ  దగ్గరకు వాహనం చేరింది. అందరూ దిగాము పిల్లలందరినీ దగ్గరకు పిలిచాను. చూశారా! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అరగంటలో అందరి అనుమతి పత్రాలను రప్పించ గలిగారు. అందుకే ప్రతీ విషయాన్ని తేలికగా తీసుకోకుండా శ్రద్ధ వహించి చేయాలి. మొదటిలోనే నన్ను బాధ పెట్టారు. మీరు ఇలా చేయకుండా ఉండవలసింది అని అన్నాను. అందరూ పిల్లలు సారీ చెప్పారు.  ఓకే! అయిపోయింది ఏదో అయిపోయింది . ఇకనుండి అందరూ ఆనందంగా ఉండండి. 
Learning aspects:
"Field Trip is a structural and constructive approach of the learning "
"Co ordination, cooperation and support among the higher authority, school management,  parents , teachers, and students is very essential for implementing constructive teaching learning approaches "

అదిగో ఆ బోర్డు కనిపిస్తుంది కదా! కేలిక్స్ కంపెనీది  . దాని డీటెయిల్స్ ను  లాగ్ బుక్ లో రాయండి ‌. లోపల టెక్నీషియన్స్ ఉంటారు వారిని ఇంటర్వ్యూ చేయండి .ఈ పరిశ్రమలో ఏమి తయారవుతుంది? ధాతువు ఏమిటి? దానిని ఎలా ప్రాసెస్ చేస్తారు? అది ఎక్కడ నుండి తెప్పిస్తారు? ఇక్కడ ఉత్పత్తిని ఎక్కడ కు ఎగుమతి చేస్తారు? ఈ కంపెనీలో ఎంతమంది పని చేస్తారు? ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాలు ఏమిటి ?మొదలైన విషయాలు అడిగి తెలుసుకోండి అని సూచించాను .పరిశ్రమ లోపలకి వెళ్లి అనుమతి తీసుకున్నాం .ఒక ఆపరేటర్ వచ్చారు. ముందు దాతు శుద్ధి చేసే ఫ్లో టేషన్ చాంబర్ వద్దకు వెళ్ళాం. ఇక్కడ నాణ్యమైన ఏకరీతి రంగు , పరిమాణం గల ధాతువును వేరు చేస్తారు అని చెప్పారు. నీటి ప్రవాహానికి ధాతువు  రేణువులు , మట్టి రేణువులు వాటి వాటి సాంద్రత  క్రమంలో డ్రై ఛాంబర్లో మేటలు వేయబడతాయి. సాంద్రత అంటే నిర్దిష్ట ఘనపరిమాణం లో గల ద్రవ్యరాశి పరిమాణంగా చెప్పవచ్చు . ప్రతి పదార్థానికి నిర్దిష్ట సాపేక్ష సాంద్రత ఉండును అని విద్యార్థులు తెలుసుకున్నారు.
Concepts covered: 
* "Interviewing is also one of the best constructive approach of learning. Also it can enable to develop enthusiasm, imagination , planing, questioning, listioning ,  conceptualization and communication skills among the students"
* Differences in between ore and mineral. Ore exploration and purification methods, different ores and their extracts, calcite ore chemical composition, it's uses , Density , Relative density imports, exports, machinery design, working, entrepreneurship etc 

ధాతువు శుద్ధి అనంతరం మట్టి తో కూడిన ఎర్రటి ఇసుక ఇక్కడ కుప్పలు కుప్పలుగా వ్యర్థంగా పడి ఉంది . దీనిని గ్యాంగ్ అంటారు. దీనితో కృత్రిమ ఇసుక ను ఎందుకు తయారు చేయలేము? ఆలోచించండి అని విద్యార్థులకు ఒక పరిశోధన అంశాన్ని గుర్తు చేశాను .
తరువాత  ధాతువు ను గుండ చే సే  యూనిట్కు చేరుకున్నాం. అక్కడ కాల్షియం కార్బోనేట్ calcite( caco3 )ధాతువు బెల్ట్ సహాయంతో క్రసింగ్ చాంబర్కు  చేరే విధానం విద్యార్థులు బాగా గమనించారు. ఇలాంటి ఎక్స్ లేటర్స్ ను మేము కూడా చేస్తామని ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు .ఈ సున్నపురాళ్లును అనంతగిరి మండలం నిమ్మలపాడు గ్రామం నుండి  లారీలలో ఇక్కడకు తెస్తామని ,ఇక్కడ ఉన్న ఈ ఐదు యూనిట్లలో పొడి చేస్తామని ,ఈ పొడిని  గుంటూరు ,విజయవాడ ,చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తామని అక్కడి ఆపరేటర్ చెప్పారు. ఈ పౌడర్ తో వైట్ సిమెంట్, బ్లీచింగ్ పౌడర్,  పుట్టి, వాషింగ్ పౌడర్ వంటివన్నీ తయారు చేస్తారని తెలిపారు. అవును అంతేకాకుండా ఈ  కాల్షియం కార్బొనేట్ ను (caco3 )వేడి చేసి గాని ఆమ్లాలతో చర్య జరిపి గాని కార్బన్ డయాక్సైడ్ వాయువును తయారు చేయవచ్చు . ఈ వాయువు  సోడా లు , డ్రింక్స్ తయారీ లో,అగ్నిమాపక యంత్రాలు లోవాడుతారు అని వివరించాను.  ఈ చర్య రసాయనిక వియోగము కు చెందిందని మీకు తెలుసు కదా! రసాయనిక చర్యలు ముఖ్యంగా నాలుగు రకాలు అవి 1 రసాయనిక సంయోగము 2 రసాయనిక వినియోగము 3 రసాయనిక స్థానభ్రంశము 4 రసాయనిక ద్వంద్వ వియోగము అని గుర్తు చేశాను. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ వేడి చేస్తే కార్బన్ డయాక్సైడ్ తో పాటు కాల్షియం ఆక్సైడ్ (cao) అనే తెల్లని బూడిద కూడా వస్తుంది. దీనిలోకి క్లోరిన్ వాయువు పంపిస్తే బ్లీచింగ్ పౌడర్  (caocl2 ) తయారవుతుంది. దీనిని మన పరిసరాలలో సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి వాడతారు అని చర్చించాము. గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న సిమెంటు ఫ్యాక్టరీలలో ఈ కాల్సియం కార్బనేట్ పౌడర్ ను   క్లీంన్కర్ తయారీలో  వాడుతారు అని జయ ప్రకాష్ బాబు గారు తెలియజేశారు.  మూడు షిఫ్ట్లో ఈ పరిశ్రమలోని 25 మంది ఉద్యోగులు పని చేస్తారని రోజుకు 25 టన్నుల పౌడర్ను ఉత్పత్తి చేస్తారని ఆపరేటర్ విద్యార్థులకు వివరించారు .ఈ పరిశ్రమ వల్ల నష్టాలు లాభాలు ఏమిటని శ్రీ హర్ష దీపక్ అడగగా దీనివలన మైనింగ్ దగ్గర ఇక్కడ కలిపి సుమారు వంద మందికి ఉపాధి దొరుకుతుందని నష్టాలు అయితే తనకు తెలియదని ఆపరేటర్ చెప్పారు. ఈ పరిశ్రమ ఇప్పుడు మూసి ఉంది ఎందుకని కార్తీక్ అడగగా మైనింగ్ కరోనా కారణంగా ఆపేశారు అలాగే గిరిజనులు కూడా మైనింగ్ను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మైనింగ్ జరగడం లేదు అందుకే ఈ పరిశ్రమ కూడా మూతపడి ఉంది అని చెప్పారు .గిరిజనులు మైనింగ్ ఎందుకు అడ్డుకుంటారు? వాళ్లకి పని  దొరుకుతుంది కదా అని విద్యార్థులు  ప్రశ్నించారు . పది పదిహేను సంవత్సరాల క్రితం బిర్లా కంపెనీ నిమ్మలపాడు  కేలసైట్  మైనింగ్ తవ్వకాలు జరపడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మైనింగ్ వరకు రహదారిని కూడా నిర్మించింది. కానీ గిరిజనులు కోర్టుకు వెళితే, కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది . మైనింగ్ను ఆపమని చెప్పింది. బిర్లా కంపెనీ ఈ గనులను వదిలి వెళ్ళిపోయింది. కానీ తరువాత వేరే వాళ్ళు కొద్దికొద్దిగా మైనింగ్ చేస్తుండడం వల్ల గిరిజనులు వారిని ఆపేశారు ఉపాధిని కూడా లెక్కచేయక అడవి పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణకు గిరిజనులు గిరిజన నాయకులు నిరంతరం తపిస్తుంటారు అడవిని వారు దేవతగా పూజిస్తుంటారు . ఈ విధంగా ప్రకృతి వనరులు వెనుక ఉండే సామాజిక పర్యావరణ అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు .
Concepts mapped: 
Uses of calcium carbonate, uses of carbon dioxide, Types of chemical reactions, How to make bleaching powder? It's uses, Why germs kills by the bleaching powder? What are the clinkers? How caco3 work s in cement factories, gypsum and plaster of paris composition and uses. What is Guang, slag ?  Environmental concern of Tribes, social and economical issues behind the mining.
Fig 1: students and mentors in field trip 

సమయం 10 30 నిమిషాలు వాహనం కాశీపట్నం వైపు వెళుతుంది .అడవి ముఖద్వారం ప్రకృతి అందాలను విద్యార్థులు ఆస్వాదిస్తున్నారు. వాహనం ముందుకు వెళ్తుంది కాశీపట్నం ఏరుదాటి పంపుల దారిలో వాహనం వెళుతుంటే చాలా బాగుంది కానీ అడవి చాలా పలచ పడిపోయింది. రహదారి పొడవునా టూరిస్టులు వేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి . టన్నెల్స్ నుండి వస్తున్న రైలుబండి వంపులు తిరుగుతూ కనువిందు చేసింది ఆ రైలు పట్టాల మీదకు కొండచరియలు విరిగిపడి రైల్వే సిబ్బందిని బలి తీసుకున్న వార్త గుర్తు చేశాను. చూసారా అదిగో ఆ కొండను చూడండి మట్టి రాళ్ళు కిందకు పడిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి .అవును సార్ ఆ ముందు నుండే ఇప్పుడు రైలు వెళ్ళింది. కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి ? అని హేమంత్ ప్రశ్నించాడు . కొండ వాలులో చెట్లు పొదలు దట్టంగా లేకపోవడం వలన వర్షపునీటి వేగము  పెరిగి రాళ్ల మధ్య ఉండే మట్టి ఇసుక క్రమక్షయం అవుతుంది. క్రమక్షయం వేగం పెరిగిపోతే కొండచరియలు విరిగి పడతాయని క్రింది వరకు అవి దొర్లుకుంటూ పోతాయి ఇందువల్ల అనేక చెట్లు వన్యప్రాణులు నశిస్తాయి .
క్రమక్షయ వేగం పెరగడానికి ఇంకో కారణం కూడా ఉంది అదేంటంటే నదులలోని పరివాహక ప్రాంతాల్లోని ఇసుక తవ్వకం పెరిగిపోవడం వల్ల ఆ లోటును  పూడ్చడానికి కొండ వాలులో మట్టి  ఇసుక క్రమక్షయం అయ్యి వస్తుంది. కనుక ఇసుక తవ్వకాల వేగాన్ని తగ్గించాలి అని వివరించాను. డముకు వ్యూ పాయింట్ నుండి అడవిని మెలికలు తిరిగిన రహదారిని రహదారిపై వాహనాల పరుగును చూస్తే చాలా బాగుంది .విద్యార్థులు ఒక ఫోటో తీసుకుని ఆనందించారు.
Concepts covered: 
Beauti of the nature, Aesthetic sense, how tourism spots polluting? Need of Eco tourism, what is erosion? Why the land slides are happening? Bad impacts of mining and sand mining?  How to reduce erosion? How to control the defarestration? Etc

 సమయం మధ్యాహ్నం 12:00 వాహనం బొర్రా గుహలకు చేరింది గబగబా టికెట్లు తీసుకుని లోనికి వెళ్లాము . గుహలు గూర్చిన వివరాలు రాసి ఉండే బోర్డ్స్ ను విద్యార్థులు చదివి ముఖ్యమైన అంశాలను లాగ్ బుక్ లో నోట్ చేసుకున్నారు. లోనికి ప్రవేశించాము. ఆ ప్రకృతి చెక్కిన శిల్ప సౌందర్యం చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు .ఫోటోలు తీసుకున్నారు. బొట్టు బొట్టుగా పై నుండి పడుతున్న నీటి బొట్లు చేతితో తాకి చల్లదనాన్ని అనుభూతి చెంది అప్పుడే శ్రీ హర్ష ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. గుహలు లోనికి వెళుతున్న కొలది చాలా చల్లగా ఉంది ఏసీ లాగ ఉంది పై నుండి ఇ సూదిగా వేలాడుతున్న నిర్మాణాలు క్రిందన మెదడును పోలి ఉండే నిర్మాణాలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అని ప్రశ్నించాడు .చాలా సంతోషం మంచి ప్రశ్నలు వేశావు.  పై నుండి వేలాడుతున్న సున్నపురాయి నిర్మాణాలను స్టాలక్టైట్ అని అంటారు అదేవిధంగా నేలపై ఉన్న నునుపైన మెదడును పోలే సమతలాల ను స్టాలక్ మైట్ లు అంటారు. ఒక్కోసారి ఈ స్టాలక్టైట్్స్ట  స్టాలక్ మైట్ లు కలిసి పోతే వాటిని సటాలక్పిల్లర్స్ అంటారు. ఇవన్నీ సున్నపురాళ్లు గుండా నీరు ప్రవహించడం వలన ఏర్పడతాయి. పై నుండి వేలాడుతున్న స్టాలక్టైట్ లు ఏ ఆకారంలో ఉన్నాయి అవి శంకు ఆకారంలో ఉన్నాయి. పైభాగంలో ఎక్కువ గణపరిమానం క్రింది భాగంలో తక్కువ ఘనపరిమాణము ఉంది. చార్లెస్ నియమం ప్రకారం నీరు తక్కువ ఘనపరిమాణం నుంచి ఎక్కువ ఘనపరిమాణం గల ఉపరితలం మీద పడగానే   నీటి ఉష్ణోగ్రత తగ్గడం వలన ఆ నీటిలో కరిగి ఉన్న సున్నపురాయి  ఘనీభవనం చెందును. ఇలా స్టాలక్టైట్ లు ఏర్పడతాయి .అదేవిధంగా నీరు కొంత ఎత్తు నుండి నేలపైకి బిందువులుగా పడుతున్నప్పుడు నీరు  ఉష్ణోగ్రతను కోల్పోయి నీటిలో కరిగి ఉన్న సున్నపురాయి ఘనీభవనం చెందును ఇలా స్టాలక్ మైట్ లు ఏర్పడును .ఇలా ఈ గుహలు లోనికి పోయే కొలది సొరంగాల ఘనపరిమాణము తగ్గి శంకు ఆకారాన్ని పోలి ఉంటాయి పై విధంగానే చార్లెస్ నియమం ప్రకారం సన్నని దార వలె పడిన నీరు ఘన పరిమాణం పెరగడం తో ఉష్ణోగ్రతను కోల్పోవును న్అంతేకాకుండా గుహ లోపల ఎక్కువ నీటి తేమ ఉండడం నీరు చల్లదనాన్నిచ్చేది కావడం వల్ల , గుహ బయట గాలి పీడనం తక్కువ గా ఉండడం వలన గుహలో గల నీరు వేగం గా బాషపీభవనం చెందడం వలన గుహలో ఏసీ లాగ ఉంది అని బదులిచ్చాను. ఇలాంటి సహజ ఎసి ని మనం తయారు చేయవచ్చు ఏమో ఆలోచించండి అని విద్యార్థులు ను  ప్రోత్సాహించాను . ఇంతకీ ఈ గుహలు ఎలా ఏర్పడతాయి అని గణేష్ ప్రశ్నించాడు .భూమిలోని రాతి పొరలులో ఇసుక రాయి పైన  సున్నపురాయి ఉన్నప్పుడు నీటి ప్రవాహం లో ఇసుక రాయి వేగంగా కరిగిపోయి ఎక్కువగా క్రమక్షయం అవ్వడం వలన పై కప్పు లాగా సున్నపురాయి ఉండడంవల్ల ఇలాంటి సహజసిద్ధ గుహలు ఏర్పడతాయి అని వివరించాను .ఇలా చర్చించుకుంటూ గుహల చివర వరకు వెళ్లి ఒక ఫోటో తీసుకొని వెను తిరిగాము . పై నుండి బొట్లు బొట్లుగా పడుతున్న నీటి దారులను చూపించి ఇలా ఈ గుహలు అంతా ఎన్నో నీటి ధారలు అన్నీ కలిసి ఇ ఒక నదిగా తయారు అయ్యాయి అని అదే గోస్తనీ నది అని మన ఊరు గుండా వెళ్లి భీమునిపట్నం వద్ద సముద్రంలో కలిసే నది దీని జన్మస్థలం ఈ బొర్రా గుహలు ఇక్కడే అని వివరించాను. ఇలా తెలియకుండానే కాలం  గడిచిపోయింది . వేగంగా బయటకొచ్చి హరిత రెస్టారెంట్లో అందరూ భోజనం చేసాము.
 వాహనం దగ్గరికి చేరుకునే మార్గంలోనే అనేక కళారూపాలు, హ్యాండ్ మేడ్ వస్తువులు, వెదురుతో చేసిన వివిధ కళారూపాలు ను విద్యార్థులతో కలిసి  చూసాము. జై ప్రకాష్ గారు హైదరాబాదుకు తీసుకెళ్లడానికి కొన్ని వెదురు కళాకృతులు కొన్నారు . తుమ్మెద పళ్ళు ,జీడి పళ్ళు, వేయించిన వేరుశెనగ పలుకులు, కొబ్బరి బొండాలు, జొన్న పొత్తులు, ఐస్ క్రీమ్ ,హల్వా , బొంగు చికెన్ ఇలా అనేక తినుబండారాలు అక్కడ అమ్ముతూ గిరిజనులు  కొంత ఆదాయాన్ని పొందుతున్నారు కొంత ఉపాధిని పొందుతున్నారు. కాఫీ గింజలు, కాఫీ పొడిని కూడా ప్లాస్టిక్ డబ్బాలులో వేసి ఇక్కడ అమ్ముతున్నారు. 
Concepts mapped: 
Formation of caves, Types of rocks, formation of sand stones, formation of lime stones, stalactite, stalacmite , Charles principles, joulthompson effect, relation between cooling, pressure, and evaporation. Origin of rivers, Destination of rivers, Deltas, Tribal income sources ,  coffee , tea crop cultivation, marketing  etc 

ఇంతలో టైం రెండు అయినది .అరకు వ్యాలీ బయలుదే రాము. అనంతగిరి మీదుగా వెళ్తున్నాం. తోవ పొడవునా ఎక్కువగా బొంగు చికెన్ అమ్ముకుంటూ గిరిజనులు ఉపాధి  పొందుతున్నారు కానీ వారి వేషధారణ, ఆర్థిక పరిస్థితులు అంత బాగా ఉన్నట్లు కనిపించలేదు . అడవి బాగా తగ్గిపోయింది. ఫిబ్రవరి కదా పంటలు కోత అయిపోయి పొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. సుంకరమెట్ట దగ్గరిలో గాలి కొండలు దర్శనమిచ్చాయి. ఒకపక్క ఎత్తయిన కొండలు ఇంకోపక్క లోతైన లోయలు ఈ కొండలు ఏంటి సార్ ఇలా ఉన్నాయి కనీసం ఒక్క మొక్క కూడా లేదు ముడతలు పడినట్లు కనిపిస్తున్నాయి అని పిల్లలు ఆశ్చర్యంగా అడిగారు .
డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసి ఆపారు నెమ్మదిగా దిగి అక్కడ ఉన్న రాళ్లను చూపించాను .అందులో మెరుస్తూ ఉన్న తెల్లటి బూడిద వంటి మూలకం అల్యూమినియం. అల్యూమినియం శాతం ఎక్కువగా ఈ రాళ్ళు లో ఉంది కనుక వీటిని బాక్సైట్ ఖనిజాలు అంటారు. అంటే అల్యూమినియం ఆక్సైడ్ .  ఈ గని  నుండి ఖనిజాన్ని తీసి శుభ్రపరిచి అల్యూమినియం లోహాన్ని సన్గ్రహిస్తారు. అల్యూమినియం లోహం ఉపయోగాలు మీకు తెలుసు కదా!  మనం వాడే పాత్రలు, పైపులు, సోలార్ ప్యానల్, విమానాల తయారీలో ఈ లోహాన్ని విరివిగా వాడుతారు. ఎందుకంటే ఈ లోహం మెత్తనిది తేలికైనది. ఈ గనులను తవ్వితీసి మన దగ్గర లో ఉన్న బౌడా రా  దగ్గర జిందాల్ కంపెనీని పెట్టి ఈ సహజ సంపదను వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం జిందాల్ కంపెనీ వారికి భూమిని కూడా కేటాయించింది .కానీ స్థానిక గిరిజనులు అడ్డుపడటంతో అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు. కంపెనీ నిర్మాణం ఆగింది .
Concepts mapped:
Causes for poverty of the tribes, Baxcite ore , uses of Alluminium metal, morphologycal features around the ores located areas. Extracting process of Alluminium from Baxcite, 

పిల్లలు ఈ విశాలమైన ప్రదేశాన్ని చూసి చాలా ఆనందించారు .పిల్లలూ అంతేకాదు ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో ఎక్కువసార్లు రంగురాళ్లు కోసం తవ్వకాలు కూడా చాలామంది చేపడుతుంటారు మీకు తెలుసా ?అని అడిగాను. అవునా ! సార్ రంగురాళ్లుఅంటే ఏమిటి? అని పిల్లలు ఎదురు ప్రశ్న వేశారు రంగురాళ్లు అంటే gemstones అని అంటారు .వజ్రవైడూర్యాలు అని అర్థం అల్యూమినియం క్రోమియం మొదలైన మూలకాలు ఎక్కువగా ఉన్న రాళ్లు సపటికీకరణ జరిగినప్పుడు కోరండం వంటి gemstones తయారవుతాయి. ఈ ప్రాంతంలో కోరడం, కెంపు , టోపజ్, మూన్ స్టోన్, pink stone ,క్యాట్ ఐ వంటి gemstones దొరికినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి .ఈ ప్రదేశానికి నా ఉద్యోగానికి చిన్న సంబంధం ఉంది ఏంటో చెప్పనా? అంటూ నా టీచర్ జాబ్ ఇంటర్వ్యూలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు రెండు ప్రశ్నలు వేశారు  అవేంటంటే మన రాష్ట్రంలో బాక్సైట్ గనులు ఎక్కడ ఉన్నాయి ? వెంటనే విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం గాలి కొండలు అని చెప్పాను అలాగే ఇంకో ప్రశ్న ఖనిజానికి , గనికి తేడా ఏంటి ?సజాతీయ అణువుల శాతము ఎక్కువగా ఉన్న రాళ్లను ఖనిజాలు అంటారు ఇవి ఒక ప్రాంతంలో కొద్ది విస్తీర్ణంలో విస్తరించి ఉంటే వాటిని తీసి లోహ సంగ్రహణ చేస్తే ఆర్థికంగా లాభసాటి కాదు . ఈ కనిజాలు ఒకే చోట ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో లభ్యమైతే అవి ఆర్థికంగా లాభసాటి అలాంటి ఖనిజాలను గనులు అంటారు .అని వివరిస్తూ మీరు కూడా భవిష్యత్తులో అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక మీ స్థానిక వనరులు,  వాటి ప్రాధాన్యత భౌగోళిక అంశాలను మీ పాఠ్యాంశాల తో కలగలిపి మీరు చదువుకోవలసిన ఉంటుందని వివరించి వాహనం  ఎక్కాము. తోవ పొడవునా అనేక టూరిజం రిసార్ట్ , టెంట్ హౌస్లు,  తేనె ఉత్పత్తి పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గిరిజనుల ఉపాధికి అభివృద్ధికి ప్రభుత్వం వారు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు . ఇంకా ఎలాంటి సహకారం, పనులు చేస్తే గిరిజనులు ఇంకా ఎలా బాగా అభివృద్ధి చెందుతారో మీరు ఆలోచించండి అని పిల్లలకు ఒక  టాస్క్ ను ఇచ్చాను. 
Concepts covered:
What are the Gem Stones,  properties of gemstones , why they are costly, uses of gems, how the gemstones forms, how to find out the diamond and corrandom, specific gravity method, hardness method, mores hardness scale, impact of urbanization on the tribes, self employment, facing interview, need of concentrating cultural , economical, geographical   aspects , etc

ఇలా మాటల్లో సమయమే తెలియలేదు అరకు వ్యాలీ వచ్చాము మూడు గంటలకి గిరిజన సాంస్కృతిక మ్యూజియంలో ప్రవేశించాం. వివిధ గిరిజన తెగలు వారి పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే అనేక శిల్ప కళాకృతులను చూసి విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు . వారి ముఖాలలో సౌందర్యాత్మక స్పృహ , అభినందించడం వంటి వైఖరులు కనిపించాయి. సైక్లింగ్ రోప్ వే , బోట్ షికార్ వంటివి బాగా ఆనందించారు చేసి. అక్కడే జరుగుతున్న ధింమసా నృత్యం ను తిలకించారు. మ్యూజియం కట్టడాల డిజైనింగ్ ఆకృతులను బాగా పరిశీలించారు . గిరిజన  సాంప్రదాయాలకు ఆధునికతను జోడించి నిర్మించిన ఫోటో కార్నర్స్ డిజైనింగ్ లు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఫోటోలు తీసుకుని బయటకు వచ్చి స్నాక్స్ టీ తీసుకొని పద్మావతి బొటానికల్ గార్డెన్స్ కి  ప్రయాణమయ్యాం. పద్మావతి బొటానికల్ గార్డెన్స్ కి వచ్చాం. ఎదురుగా చిన్న పల్లె ఆ ప్రజలు ఇంకా చాలా అభివృద్ధి చెందవలసి ఉంది అని అనిపించింది. పక్కనే దింసా నృత్యం  చేస్తున్న కళాకారులను చూసాము. ఎక్కువ సౌండ్ పెట్టుకొని సంగీతం ప్లే చేసుకుంటూ ఆకర్షణీయమైన ఏకరీతి దుస్తులు ధరించుకొని మహిళలు నృత్యం చేస్తుంటే , మగవారు ఇతర సందర్శకులు చుట్టూ చేరి కేరింతలు కొడుతున్నారు .ఇది చూసి గిరిజనులు వారి మౌలికమైన సాంప్రదాయాలను సినిమాల ప్రభావంతో కోల్పోతున్నారని అనిపించింది .ఈ సందర్భంగా అస్సాం డార్జిలింగ్ , మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో గిరిజన ప్రజలు జీవన విధానం వారి సాంప్రదాయం పండగలు వారి అభివృద్ధి  ప్రణాళికలు వస్త్రధారణ వంటి విషయాలను విద్యార్థులకు గుర్తు చేశాను. వారి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయి అభివృద్ధిని కనబరుస్తున్న వారి ప్రణాళికలు ఇక్కడ అమలు చేస్తే బాగుంటుంది అని విద్యార్థులతో చర్చించాను .   నేను రెండు దఫాలుగా ఈశాన్య రాష్ట్రాలలో సందర్శించినప్పుడు అక్కడ అభివృద్ధిని ప్రజల జీవన విధానం వస్త్రధారణ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మన రాష్ట్రంలోని గిరిజనులు కూడా అలాంటి మార్గాలు అవలంబించాలని నాకనిపిస్తుంది అందుకుగాను అంశాల వారీగా కృషి అలాగే ప్రభుత్వాలు కార్యాచరణ ఎన్జీవోస్ అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను . గిరిజన సాహిత్య వేత్తలు , సంగీత కళాకారులను , సాంప్రదాయాలు పై అవగాహన ఉన్న విద్యా వేత్త లను గుర్తించాలి వారిని ప్రపంచానికి పరిచయం చేసే బలమైన మీడియా ఉండాలి.  డాక్యుమెంటరీలు , షార్ట్ ఫిలిమ్స్ , ఫోటోగ్రఫీ , మల్టీ మీడియా,  బయూటిఫికేషన్ వంటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలి అని అనిపించింది.  
Concepts covered: 
Tribal museum, Tribal culture and life style, Need of survival of tribal culture , literature,  and manuscripts, Botanical garden, floriculture, epi culture, mushroom culture etc, biodiversity, how to educate, need of modern skills among the youth. How could some of the eastren states people civilized. How tribes loosing their nativity by the impact of cinema and Television program s. 
సమయం సాయంత్రం ఆరు గంటలు కావచ్చింది. టీ, స్నాక్ తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. అరుకు అనంతగిరి మద్యలో తేనెటీగలు పెంపకం కేంద్రాన్ని సందర్శించాము.  తేనె ఉత్పత్తి , లాబ నష్టాలు గూర్చి,  తేనె ఈగలు రకాలు, వాటి జీవన విధానం, ప్రకృతి వైపరీత్యాల ను ఇవి ముందుగా ఎలా కనిపెడతాయి, తేనె ఈగలు ఈ పర్యావరణ పరిరక్షణ లో ఎలా దోహదం చేస్తున్నాయి వంటి ప్రశ్నలు ను విద్యార్థులు  పెంపకం దారులు ను అడిగి తెలుసుకున్నారు .  రాత్రి 8.30 కల్లా అందరి విద్యార్థులు ను వారి వారి ఇండ్ల వద్ద దించి తల్లి తండ్రుల కు అప్పగించాను. ఈ ఫీల్డ్ ట్రిప్ లో మీరు నేర్చుకున్న శాస్త్రీయ అంశాలు ను, మీ అనుభవాలు, అనుభూతి లను క్రోడీకరించి ఒక రిపోర్టు తయారు చేసి ఐదు రోజుల లో ఇవ్వమని విద్యార్థులు కు అసైన్మెంటు ఇచ్చి  జయ ప్రకాష్ గారు నేను మా ఇంటికి చేరాం. 
Concepts covered: 
Epi culture, challenges , how honey bees helps in environmental sustainability. How to write field trip report, concern etc 
              

Comments

Popular posts from this blog

ATL Curriculum Framework Workshop: A Collaborative Effort for Future-Ready Education

Traditional Teaching vs. Constructive Teaching: A Case for Student Engagement

Enhancing Education Through Technology